13-03-2025 04:33:53 PM
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్(Chegunta Congress Party President Vadla Naveen Kumar) ఆధ్వర్యంలో భద్ర కాళీ రోడ్డు లైన్స్ ఒనర్ కొండాపూర్ దుర్గ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందించడం జరిగింది. ఈ సందర్బంగా వడ్ల నవీన్ మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి పరీక్షలు బాగా రాసి పాఠశాలను జిల్లాలో, మండలో మంచి పేరు తేవాలని కోరారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్క్స్ 9.5 వచ్చినవారికి చెరుకు ముత్యం రెడ్డి మెడల్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రకళ, సీనియర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.