04-09-2025 07:52:28 PM
కెనరా బ్యాంక్ మేనేజర్ సాదం వెంగళరావు
తుంగతుర్తి (విజయక్రాంతి): కెనరా బ్యాంక్ అందిస్తున్న డాక్టర్ అంబేద్కర్ విద్యాజ్యోతి స్కాలర్ షిప్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కెనరా బ్యాంక్ మేనేజర్ సాదం వెంగళరావు(Canara Bank Manager Sadam Vengal Rao) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రతిభావంతమైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందజేసి మాట్లాడారు. ఐదవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు రూ.3వేలు, 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రూ.5 వేల స్కాలర్ షిప్ లను అందజేయడం జరిగిందన్నారు. ఈ స్కాలర్‌షిప్‌లు విద్యార్థులకు వారి విద్యను కొనసాగించడంలో సహాయపడటానికి ఉద్దేశించబడ్డాయని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మద్దతు ఇవ్వడమే ఈ పథకం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి, కెనరా బ్యాంక్ సిబ్బంది చీకటి వెంకన్న, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.