04-09-2025 09:07:03 PM
ఎమ్మెల్యే జారె..
ములకలపల్లి (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) గురువారం ములకలపల్లి, జగన్నాధపురం గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్ధి వినాయకుని ఆశీస్సులతో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి, ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.