04-09-2025 07:59:19 PM
మేడ్చల్ (విజయక్రాంతి): జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుతో సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని బిజెపి నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి(BJP leader Paturi Sudhakar Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారు ఎక్కువగా ఉపయోగించే వస్తువుల జీఎస్టీ తగ్గించిందన్నారు. దీనివల్ల వాటి ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. జీఎస్టీ తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.