calender_icon.png 4 September, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం పరిమళించిన వేళ..

04-09-2025 08:37:10 PM

అనాధ శవానికి అంత్యక్రియలు..

అదిలాబాద్ (విజయక్రాంతి): మానవత్వం పరిమళించేలా ఓ అనాధ శవానికి అంత్యక్రియలు చేశారు ఆదిలాబాద్ చెందిన స్వచ్ఛంద సంస్థల సభ్యులు.. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 40 సంవత్సరాల ఓ మహిళ నాలుగు రోజుల క్రితం మృతి చెందడంతో స్థానిక రిమ్స్ శవాగారంలో ఉంచారు. బంధువులు ఎవరు రాకపోవడంతో వన్ టౌన్ ఎస్సై రమ్య మానవసేవే మాధవసేవ, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అనాధ శవానికి స్థానిక స్మశాన వాటికలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమ్య, మానవసేవే మాధవసేవ అధ్యక్షురాలు చౌహాన్ శశికళ, సభ్యులు  నర్సింగ్, బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సభ్యులు ఆసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.