26-07-2025 12:00:00 AM
అర్మూర్, జులై 25 (విజయ క్రాంతి): అర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ రాజు మొక్కలు పంపిణీ చేశాడు. వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం మూడు, నాలుగు వార్డుల్లోని ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. అలాగే వంద రోజుల కార్యాచరణలో భాగంగా వార్డు నంబర్ 12, 29 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగింది.
12 వ వార్డులో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. పెర్కిట్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ ధవాఖానను సందర్శించి రోగుల వివరాలు, మందుల లభ్యత గురించి మెడికల్ ఆఫీసర్ గారిని అడిగి తెలుసుకున్నారు.