20-12-2025 01:26:11 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, డిసెంబర్ 19 :(విజయ క్రాంతి): ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ నెల 22వ తేదీన జిల్లాలో ప్రయోగాత్మక రీతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న టేబుల్ టాప్ (మాక్) ఎక్సర్ సైజ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయాల లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సన్నద్ధ తను పెంపొందించేందుకు వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న అన్ని జిల్లాలలో మాక్ ఎక్సర్ సైజ్ ను నిర్వహించాలని ఆదేశించింది.
ఈ నేపధ్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని టీ.జీ.ఐ.సి. సి.సి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎన్.డీ. ఎం.ఎ మేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ హసనైన్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ ఇతర ఉన్నథాధికారూలతొ కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. మాక్ ఎక్సర్ సైజ్ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేస్తూ, ఈ కార్యక్రమా న్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీ.ఎస్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు దిశా నిర్దేశం చేశారు. విపత్తులు సంభవించిన సమయంలో సమర్ధవంతంగా ఎదుర్కొ నేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉన్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
22వ తేదీ నాటి మాక్ ఎక్సర్ సైజ్ సందర్భంగా ఈ తరహా అన్ని చర్యలు ప్రయో గాత్మకంగా చేపట్టేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాక్ ఎక్సర్ సైజ్ ను నిర్వహించడం వల్ల విపత్తులను ఎదుర్కొనే విషయంలో ఏ మేరకు సన్నద్ధత కలిగి ఉన్నామనే విషయం వెల్లడి అవుతుందని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకునేందుకు, అవసరమైన పరికరాలను సమకూర్చుకునేందుకు అవకాశం కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖల అధికారులు అందరూ మాక్ ఎక్సర్ సైజ్ ను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు.
విపత్తుల సమయంలో నీటిపారుదల, అగ్నిమా పక, విద్యుత్, రహదారుల, పోలీస్, రెవె న్యూ, వైద్య, పౌరసరఫరాల తదితర శాఖల అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, పరిశ్రమల శాఖ రీజినల్ డిప్యూటి చీఫ్ ఇన్స్ పెక్టర్ లక్ష్మి, కలెక్టరేట్ విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వైద్యారోగం, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.