24-11-2025 12:56:43 AM
పాఠశాల సమీపంలో 161 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
డెహ్రాడూన్, నవంబర్ 23: ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా దబారా గ్రామంలో ఆదివారం పోలీసులు పేలుడు పదార్థాలను గుర్తించారు. గ్రామంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని అందిన సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
సమీప పొదల్లో ఉన్న ఆ వస్తువులు జిలెటిన్ స్టిక్స్‌గా సోదాల్లో తెలిసింది. 20కిలోల బరువున్న 161జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని సీనియర్ సూపరింటెండెంట్ దేవేంద్ర పించా తెలిపారు. అయితే, పేలుడు పదార్థాలను ఎవరు ఇక్కడ పెట్టారు? ఎందుకు పెట్టారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.