24-11-2025 12:54:54 AM
న్యూఢిల్లీ, నవంబర్ 23 : సింధూ భూ భాగం పాకిస్థాన్‌లో ఉండొచ్చు కానీ అది ఎప్పటికీ భారతదేశంలో భాగమే అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులు మారవచ్చు.. ఆ ప్రాంతం భారత్‌కు తిరిగి రావొచ్చు.. ఏమో ఎవరికి తెలుసు అని వ్యాఖ్యానించారు.
1947లో దేశ విభజన తర్వాత సింధూ నదికి సమీపంలో ఉన్న సింధ్ ప్రావిన్స్‌లో నివసించిన సింధీ ప్రజలు భారతదేశానికి వచ్చినా ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉండిపోయిందని తెలిపారు. కానీ అక్కడి నుంచి వచ్చిన హిందువులు ఈ విషయాన్ని అంగీకరించడం లేదన్నారు.
అద్వానీ తన పుస్తకంలో రాశారని..
భారత్ నుంచి సింధూ భూ భాగం విడిపోవడాన్ని అప్పటి తరం హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అప్పటి తరం హింధువు ఎల్‌కే అద్వానీ తన పుస్తకంలో రాశారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సింధూ ప్రాంతంలోనే కాదు భారత దేశం అంతటా హిందువులు సింధూ నదిని పరమ పవిత్రంగా భావిస్తారని తెలిపారు.
సింధూలోని చాలా మంది ముస్లింలు కూడా సింధూ నది నీటిని మక్కాలోని ఆబ్ కంటే పవిత్రమైనదని విశ్వసిస్తారు.. అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.