05-07-2025 01:00:24 AM
రెండేళ్ల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): సచివాలయం పరిధిలో డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ పదవీకాలాన్ని పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీ పదవీకాలాన్ని రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సభ్యులుగా, సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు.
ప్రస్తుతం జారీచేసిన ఉత్తర్వులతో కమిటీ 2027 జూన్ 6వ తేదీ వరకు కొనసాగుతుంది. సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను సెక్షన్ ఆఫీసర్లుగా బదిలీ లేక పదోన్నతి కల్పించడం, స్పెషల్ స్టెనోగ్రాఫర్లను ప్రభుత్వ కార్యదర్శుల ప్రైవేట్ సెక్రటరీలుగా నియమించే బాధ్యతను కమిటీ నిర్వహిస్తుంది.