05-07-2025 01:02:25 AM
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న చోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయను న్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీటిని గ్రామీణ నివాస ప్రాంతాలు, పట్టణ కాలనీల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుండి ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రభుత్వ వసతి గృహాల్లో లేదా అద్దె భవనాల్లో పాఠశాలలను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు.