12-08-2025 07:27:27 PM
మేడ్చల్ అర్బన్: మద్యం సేవించి వాహన తనిఖీల్లో పట్టుబడ్డ వాహనదారులకు చుక్కలు కనిపించేలా న్యాయమూర్తులు తీర్పులిస్తున్నారు. గతంలో మద్యం సేవించి వాహనం నడిపిన పలువురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వగా, తాజాగా మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురికి అత్వెల్లి ఏడవ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి 12 గంటల పాటు ట్రాఫిక్ కంట్రోలింగ్ డ్యూటీ విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు. మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని మేడ్చల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్(Traffic Circle Inspector Madhusudhan) హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు ఎక్కే ముందు ట్రాఫిక్ నియంత్రణలు పాటించాలని సూచించారు.