calender_icon.png 27 July, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో కంకోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం

26-07-2025 12:00:00 AM

మంత్రి దామోదర్ రాజనర్సింహ 

సంగారెడ్డి, జూలై 25(విజయక్రాంతి): మునిపల్లి మండలం కంకోల్ లో కూరగాయల మార్కెట్, పశువుల సంత ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం గ్రామానికి చెందిన ప్రతినిధులతో  సంగారెడ్డిలోని తన నివాసంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంకోల్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు త్వరలో పూర్తిచేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సూచించారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.