07-07-2025 01:18:10 AM
నామమాత్రం చర్యలతో సరిపెడుతున్న అధికారులు
ఇసుక మాఫియాకు అధికారుల అండదండలు
మహబూబ్ నగర్ జూలై 6 (విజయ క్రాంతి) : జడ్చర్ల చుట్టుపక్కల ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుం ది. దుందుభి వాగు నుంచి దర్జాగా ట్రాక్టర్లు, టిప్పర్ల లలో జెసిబిల సహాయంతో నింపి ఇ సుకను భారీ వాహనాలు కూడా వచ్చే ప్రాం తాలకు దర్జాగా తరలిస్తున్నారు. అనువైన ప్రాంతాల్లో డంపు చేసి డిమాండ్ అత్యధికంగా ఉన్న ప్రాంతాలకు దర్జాగా తరలిస్తూ పోగు చేసుకుంటుండ్రు.
అక్రమ ఇసుక రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ జడ్చర్ల లో అక్రమ ఇసు క రవాణా ఆగడం లేదు. అధికారులు అంత పర్యవేక్షణ చేస్తున్నామని నిత్యం చెబుతున్నప్పటికీ అక్రమ ఇసుక రవాణా ఆపడంలో మాత్రం వెనకడుగు వేస్తుండ్రు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
-ఎన్ని శాఖలు ఉన్న ఏ లాభం...?
అక్రమ రవాణా ఇసుక ఆపేందుకు పలు శాఖలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పినప్పటికీ ఉపయోగమాత్రం ఆశించిన మేరకు రావడం లేదు. నిబంధనలు మేరకు ఇసుక తరలింపులు జరిగితే ప్రభుత్వానికి ఆదా యం రావడంతో పాటు పారదర్శకంగా ఇ సుక తరలింపు జరుగుతుందని మంచి పేరు కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని ఆరోపణలే ఉన్నా యి.
మైనింగ్, పోలీస్, రెవెన్యూ ఇలా పలు శాఖలు సమర్థవంతంగా పనిచేసే అక్రమ ఇసుక రవాణా జరగకుండా ఆపేందుకు ప్ర భుత్వం సంపూర్ణమైనటువంటి బాధ్యతలను అప్పగించింది. ఇసుక అక్రమ రవాణాలో మాత్రం ఆయా శాఖలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అడ్డుకట్ట జరగని మాటేనా....
ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట ఇక జరగను మాటైన అనే సందేహాలు రాక మా నడం లేదు. రాత్రి పగలు అనే భేదం లేకుం డా ఒక జడ్చర్ల నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా వాగులు ఉన్న ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా యధావిధంగా కొనసాగుతుంది. ఒకవేళ రెవెన్యూ అధికారులు ఒకటి రెండు ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చినప్పటికీ ఆ రెండు ట్రిప్పుల ఇసుక రవాణా కు ప్రజల సంఖ్యలో ఇసుక దర్జాగా రవాణా చేస్తున్నారు.
అధికారులు ఎంతమంది ఉన్న అక్రమంగా రవాణా జరిగే ఇసుకను అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రజలు ఆరోపి స్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి పూర్తిస్థాయిలో అక్రమ రవాణా ఇసుకను నిలిపివేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
రంగాపురం గ్రామపంచాయతీలో..
జడ్చర్ల మండలంలోని గంగాపురం గ్రామపంచాయతీ కోడిపత్రి గ్రామ సమీపంలో చెరువు కట్ట దగ్గర ఇసుక డప్పు చే సిండ్రు. స్థానికంగా ఉండే కొంతమంది నాయకులను సహకారంతో ఇసుక వ్యాపారులు దర్జాగా తమ వ్యాపారాన్ని కొనసాగి స్తున్నారు.
ఎవరైనా అడ్డుకున్నందుకు ప్రయ త్నం చేస్తే వారిపై బెదిరింపులకు సైతం పా ల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వెం టనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
భూగర్భ జలాలులో లోపలికి...
ఇసుక తరలింపు అక్రమంగా చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా అట్టడుగువు పడిపోతున్నాయి. వేసవికాలం వచ్చిందంటే ఆయా ప్రాంతాల్లో బో ర్లలలో నీరు రాక వేసిన పంటల సైతం ఎండిపోతే వదిలేయవలసిన పరిస్థితులు ఉన్నా యి. అధికారులు ప్రభుత్వా నిబంధనలను పాటిస్తూ ఇసుక రావాలని చేస్తే భూగర్భ జలాలు సైతం అట్టడుగు పడిపోయే అవకాశాలు ఉండాలని రైతులు కోరుతున్నారు.