calender_icon.png 4 October, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనగామలో నకిలీ పోలీస్ అరెస్ట్

04-10-2025 07:48:00 PM

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నకిలీ పోలీసును అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన కిరణ్ గతంలో పోలీస్ వాహనంపై డ్రైవర్ గా పనిచేసి మానేశాడు. కుమారస్వామి అనే కానిస్టేబుల్ ఐడి కార్డు, దొంగలించి దానితో తానే పోలీసు అని, అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.