04-10-2025 07:49:45 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): పాత కక్షను మనసులో పెట్టుకొని దాడి చేసిన వ్యక్తిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. కామారెడ్డి పంచముఖ హనుమాన్ కాలనీకి చెందిన కేతన్, రకుల్ అనే ఇద్దరు యువకులపై సిద్ధార్థ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజు ముక్కతో దాడి చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.
దసరా రోజు అర్ధరాత్రి దాండియా వద్ద జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులైన సిద్ధార్థ్ అనే యువకుడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. దసరా రోజు అర్ధరాత్రి పోలీసులకు 100 డయల్ కాల్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే తమ సిబ్బంది గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లగా అక్కడ రెండు గ్రూపు లు కొట్టుకున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యుడైన సిద్ధార్థ ను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.