04-10-2025 07:45:16 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): స్థానిక సంస్థలు ఎన్నికలు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి సీపీఎం సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా కమిటి సభ్యులు దివ్వెల వీరయ్య మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు వెల్లడించారు. స్థానిక ఎర్రుపాలెం కామ్రేడ్ రామిశేట్టి పుల్లయ్య భవనంలో ఎర్రుపాలెం గ్రామ శాఖ సమావేశం దేవరకొండ రామకృష్ణ అధ్యక్షతన జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బిజెపి మినహా కలిసొచ్చే పార్టీలతో ఎన్నికల అవగాహన పొత్తులు, సీట్లు సర్దుబాట్లు ఉంటాయని లేని పక్షంలో ఒంటరిగానే జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఒంటరిగా భారీలో అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసుకొని ఎన్నికల భారీలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా అక్టోబర్ 8 న బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వెలువబడనున్న నేపథ్యంలో ఆ తీర్పు ఆధారంగానే ఎన్నికల భారీలో దిగే అంశాన్ని నిర్ణయిస్తామని.తీర్పు వెలువడిన వెంటనే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.