15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన ఫర్హాన్

01-03-2026 12:00 AM

పల్లెకెలే, ఫిబ్రవరి 28 : పాకిస్థాన్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీ మిండియా దిగ్గజ బ్యాటర్ వి రాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఫర్హాన్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యా చ్లు ఆడిన ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 319 పరుగులు చేశాడు. గత 12 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును ఫర్హాన్ ఇప్పుడు బ్రేక్ చేశా డు. ఆ తర్వాత శ్రీలంక మాజీ ప్లేయర్ తిలక రత్నే దిల్షాన్(317) మూడో స్థా నంలో ఉన్నాడు.

2009 టీ20 ప్రపంచకపలో అత ను 317 పరుగులు చేశాడు.కాగా ఒకే ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. తాజా మ్యాచ్‌తో పాటు నమీబియాతో మ్యాచ్‌లోనూ ఫర్హాన్ శతకాలు సాధించాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ రికార్డును సైతం ఈ పాక్ క్రికెటర్ సమం చేశాడు. పొట్టి ప్రపంచకప్‌లో గేల్ 2 సెంచరీలు నమోదు చేశాడు.