17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

గెలిచినా ఇంటికే..

01-03-2026 12:00 AM

టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ఔట్

శ్రీలంకపై అనుకున్న రన్‌రేట్ సాధించని పాక్

మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్ 

పల్లెకెలే, ఫిబ్రవరి 28 : టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కథ సూపర్ 8లోనే ముగిసింది. శ్రీలంకపై చివరి మ్యాచ్‌లో గెలిచినా కూడా సెమీఫైనల్ చేరలేకపోయింది. ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో గెలిచి ఉంటే పాక్ సెమీస్‌లో అడుగుపెట్టేది. అయితే లంకను 147 పరుగుల లోపు కట్టడి చేయడంలో పాక్ విఫలమైంది. కేవలం 5 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్ మూడో స్థానానికే పరిమితవగా.. ఆ జట్టు కంటే మెరుగైన రన్ రేట్ ఉన్న న్యూజిలాండ్ ముందంజ వేసింది. కాగా సెమీఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు సర్వశక్తులూ ఒడ్డింది. మొదట బ్యాటింగ్ కు దిగి భారీస్కోరు సాధించడమే లక్ష్యంగా ఆడింది. ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ జమాన్ తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో పార్టనర్ షిప్ నెలకొల్పారు.

15.5 ఓవర్లలో ఏకంగా 176 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫకర్ జమాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 రన్స్‌కు ఔటవగా.. ఫర్హాన్ మాత్రం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెగాటోర్నీలో అతనికిది రెండో సెంచరీ. అంతకుముందు లీగ్ స్టేజ్ లో నమీబియాపైనా ఫర్హాన్ శతక్కొట్టాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఒక ఎడిషన్ లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సైతం బద్దలుకొట్టాడు. అలాగే వరల్ కప్ లో అత్యధిక సెంచరీలు(2) చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. అయితే చివర్లో పాక్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం తగ్గింది.

చివరికి పాకిస్థాన్ 8 వికెట్లకు 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఛేజింగ్ లో శ్రీలంక అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. త్వరగానే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది.33 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా...అసలంక (25) , పవన్ రత్నానాయకే(58) పరుగులతో రాణించారు. అయితే 147 పరుగుల లోపే కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నించినా పాక్ సక్సెస్ కాలేకపోయింది.

మరోవైపు చివర్లో ఒక్కసారిగా మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. కెప్టెన్ దసున్ శనక భారీ సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 76  పరుగులు చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో విజయం కోసం 28 పరుగులు చేయాల్సి ఉండగా.. వరుసగా 4 , 6 , 6 ,6 బాదాడు. ఈ దశలో చివరి 2 బంతులునూ షాహీన్ అఫ్రిది డాట్ బాల్స్ వేయడంతో లంక చారిత్రక విజయాన్ని అందుకోలేకపోయింది.