27-11-2025 12:20:40 AM
సౌత్ ఇండియా అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ సుధా నాగేందర్
ముషీరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాజ్యాంగాన్ని ఇంటింటికి చేర్చడమే తమ లక్ష్యమని సౌత్ ఇండియా అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ సుధా నాగేందర్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సమావేశంలో సుధా నాగేందర్, సుప్రీంకోర్టు న్యాయవాది ఉపాధ్యాయ, న్యాయవాదులు కిషోర్, సతీష్, శ్యామ్ రావు, బెన్నీ, రాజకుమార్, వంశీ, వైష్ణవి, యాదగిరి, శ్రీనివాసరెడ్డి, పి. మోహన్ రావు, రవి కిషోర్, కటకం శారద, శ్రీధర్, కంట మురళి తదితరులు పాల్గొన్నారు.