23-01-2026 12:00:00 AM
పుల్లెంల గణేష్ :
భారతీయ వ్యవసాయ రంగానికి, యూరియాకు విడదీయలేని సంబంధముంది. దేశంలో యూరియా ఉత్పత్తి విధానం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండగా, మిగతా వ్యవసాయ క్రిమిసంహార, పంట దిగుబడి పెంచే ఫర్టిలైజర్స్ ప్రైవేటు వ్యాపారుల ఆధీనంలో ఎక్కువగా ఉండడం గమనార్హం. దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడి పరిసరాలకు అనుకూలంగా పంటలు వేయగా, మన తెలంగాణలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు వేయడం ఆనవాయితీ.
కాగా ప్రస్తుత రబీ సీజన్‌లో తెలంగాణ రైతులు వరి పంటకు మొదటి విడతలో భాగంగా యూరియానివేయాల్సి ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన సమయంలో రాష్ట్రంలో యూరియా కొరత అతి భయంకరంగా ఉండడం రైతుల పాలిట శాపంగా మారింది. అయితే ఇక్కడ యూరియాను కేంద్ర ప్రభుత్వమే ఆయా రాష్ట్రాల కు అవసరమైన మేరకు సరఫరా చేస్తుంది. అయితే ఆయా రాష్ట్రాలను పాలిస్తున్న ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు అవసరమైన యూరియాని కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకోవడం తమ బాధ్యతగా గుర్తుంచుకోవాలి.
గత ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికల ద్వారా, ప్రైవే టు వ్యాపారుల ద్వారా యూరియాని మిశ్రమంగా సరఫరా చేసింది. ఇప్పుడు రబీ సీజ న్‌లో భాగంగా రైతులు ప్రత్యక్షంగా ప్రైవేటు వ్యాపారు దగ్గరికి వెళ్లి తమకు అవసరమైన యూరియాని కొనుక్కునే వెసులుబాటు కల్పించకుండా, నూతన సాంకేతికతని ఉపయోగించుకొని మొబైల్ యాప్ ద్వారా రైతులకు యూరియా తెచ్చుకునే సరికొత్త విధా నాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
సవాల్‌గా మొబైల్ యాప్..
అయితే యాప్ ద్వారా యూరియా కొనుగోలు అంశం రైతులకు ఇబ్బందికరంగా మారిపోయింది. గతంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కొంత సొసైటీల ద్వారా, మిగతావి ప్రైవేటు వ్యాపారుల భాగస్వామ్యంతో యూరియాను సరఫరా చేసేది. అయితే రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన సరికొత్త మొబైల్ యాప్ విధానం తెలంగాణ గ్రామీణ రైతులకు సవాల్‌గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్లో ఎక్కువగా అక్షరాస్యత లేకపోవడం, స్మార్ట్ ఫోన్ వాడ కం తెలియకపోవడంతో యూరియాని బుక్ చేసుకుని తమ వ్యవసాయ పంటలను త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడంలో నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
అయితే తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే ఎక్కువగా ఉండేది చిన్న, సన్నకారు రైతులే. అందులో మెజార్టీగా సరైన విద్య లేక, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలియకుండా వ్యవసాయం చేసే వాళ్లే అత్యధికం. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తాను (45 కేజీలు) 266 రూపాయలకి రైతులకి సరఫరా చేస్తుంది. కానీ ప్రైవేట్ వ్యాపారులు ఒక యూరియా బస్తాను 350 నుంచి 450 వరకు అమ్ముకుంటూ ఒక్కో బస్తాపై కనీసం వంద రూపాయల లాభాన్ని అర్జిస్తూ సిండికేట్ వ్యాపారానికి తెర తీశారు.
మోసపోతున్న రైతులు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా పంపిణీ మొబైల్ యాప్ విధానంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ యాప్ విధానా న్ని అమలు చేయడంతో రైతులు పడుతున్న ఇబ్బందులతో భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోక తప్ప దు! ఎందుకంటే ప్రభుత్వం తెచ్చిన కొత్త యూరియా మొబైల్ యాప్ ద్వారా రాష్ర్టంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోని ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులు కేంద్ర ప్రభుత్వమిచ్చే 266 రూపాయలకు రైతులకి యూరియా బస్తాని ఇవ్వడం మూలంగా తమకి లాభం లేకపోవడంతో ప్రైవేట్ యూరియా వ్యాపారులు తమ షాపుల్లోకి యూరియాను కొనుగోలు చేసుకోవడం లేదు.
అతి కొద్ది మంది డిస్ట్రిబ్యూటర్లు, డీల ర్లు మాత్రమే యూరియాను ప్రభుత్వం నుం చి కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేస్తున్నారు. అయితే కొంతమంది వ్యాపారస్తులు యూరియాను ప్రభుత్వ నుంచి దిగుమతి చేసుకున్నా తక్కువ ధర ఉందన్న కారణంతో రైతులకు పంపిణీ చేయడం లేదు. దీంతో చాలా మంది రైతులు తమకు దూరంగా ఉన్న మండలంలో యూరియాను బుక్ చేసుకుంటున్నారు. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు భారమైనప్పటికీ తమ పంటలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వెనకాడడం లేదు.
కానీ 45 కేజీలు రావాల్సిన యూరియా బస్తాలు రైతుల చేతికొచ్చేసరికి అది 39 కేజీలే ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు విద్య లేకపోవడం వల్ల స్మార్ట్ ఫోన్ వాడే విధానం తెలియకపోవడం, యూరియాని మొబైల్ యాప్‌లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియ కు నానా అవస్థలు పడుతున్నారు. అయితే తమకు లాభం లేనిదే రైతుల కోసం ప్రభు త్వం నిర్ణయించిన ధరకే యూరియా పంపి ణీ చేయడం కుదరదని పేర్కొంటున్నారు. అంతేకాదు ప్రైవేటు బడా డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు యూరియాని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయకుండా ఇతరత్రా లాభం వచ్చే ఫర్టిలైజర్స్‌ను అమ్ముకుంటున్నారు.
రైతుల అవస్థలు..
తెలంగాణలోనే కాదు భారతదేశంలో, ప్రపంచంలో ఏ వ్యవసాయదారుడైన ఆహా ర ఉత్పత్తి సహా ఇతర వాణిజ్య ఉత్పత్తి పంట ల ఎదుగుదలకి యూరియాను వేయడం ఒక సహజమైన ప్రక్రియ. పంట ఎదుగుదలకి యూరియా అనేది ఎంత శక్తివంత మైనదో దాని ప్రాముఖ్యతను గ్రహించి ప్రభుత్వాలు రైతులకు అవసరమైన పంట దిగుబడి పెంచే ఫర్టిలైజర్స్ అందించడంలో ప్రభుత్వాలు బాధ్యతగా ఉండాలి.
అంతేతప్ప ప్రైవేటు వ్యాపారుల విధానాలపై ప్రభుత్వా లు ఎక్కువ ఆధార పడటం మూలంగా అం తిమంగా నష్టపోతున్నది వ్యవసాయదారులే అన్న విషయం గ్రహించాల్సిన అవసరముంది. కానీ రాష్ర్టంలో ప్రభుత్వ వ్యవసా య విస్తరణ అధికారులపై అవసరానికి మించిన పనులు ఉంటున్నాయి. కానీ అంతిమంగా రైతులకి ఏవో, ఏఈఓల మధ్య వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచే కమ్యూనికేషన్ లోపం ఎక్కువగా ఉండటం మూలంగా నే అంతిమంగా రాష్ట్ర రైతాంగం నష్టానికి గురవుతున్నారు.
మార్పులు అవసరం..
కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పరిచే క్రమంలో భాగంగా ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడకుండా ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా, వ్యవసాయ సైంటిస్టులుగా, ఏవో, ఏఈవోలుగా బాధ్యతల్లో ఉన్న అధికారులతో పనులు జరిగేలా చూడాలి. అధికారుల నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని తెలంగాణ రైతుల పంట దిగుబడికి సహాయమందేలా ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ వ్యవసాయ సైంటిస్టులని, ప్రొఫెసర్లను, ఇత ర ఏవో, ఏఈవోలను వ్యవసాయానికి అతీతంగా రైతులకు వ్యవసాయం పట్ల తగిన జ్ఞానాన్ని అందించాల్సిన అవసరముంది.
ఇక ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి లాభాలు పొందకుండా సాంప్రదాయ వ్యవసాయ విధానంతో తెలంగాణ రైతాంగం నష్టపోతున్నారనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు గ్రహించాలి. అంతిమంగా తెలంగాణ రాష్ర్టంలో రైతులు పడు తున్న యూరియా ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని పరిష్కరించాలి. లేదంటే బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చారు.
కానీ వ్యవసాయం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శ్రద్ధ చూపకపోతే రాబోయే రోజుల్లో పార్టీలకతీతంగా లక్షలాది రైతుల నుంచి తీవ్ర వ్యతి రేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకా దు రాబోయే ఎన్నికల్లో రైతాంగం తమ ఓట్ల ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికైనా యూరియా విషయంలో రైతులు పడుతున్న అరిగోసకు పరిష్కారం చూపించాలి. యూరియాను మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేయడంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యూరియా కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న విధి విధానాల్లో కూడా మార్పులు తేవాలి.
వ్యాసకర్త సెల్: 9553041549