16-10-2025 09:40:20 AM
మొలకెత్తిన ధాన్యం
మొత్తుకుంటున్నా రైతులు
వలిగొండ,(విజయక్రాంతి): వరి కోతలు ప్రారంభమై పక్షం రోజులు కావస్తున్న నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యం కొనండి మహాప్రభో అని ప్రభుత్వాన్ని(Government) అధికారులను వేడుకుంటున్నారు. గత నాలుగు రోజుల క్రితం వలిగొండ మండలంలోని(Valigonda Mandal) వివిధ గ్రామాలతో పాటు వలిగొండ మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షంతో రైతుల ధాన్యం తడిసిపోయింది. కాగా పలువురి రైతుల(Farmers) ధాన్యం పూర్తిగా తడవడంతో ధాన్యం మొలకెత్తింది. వలిగొండ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు రైతుల పట్ల కనికరించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మొలుకెత్తిన ధాన్యాన్ని చూసి తమ ఆరుగాలం కష్టం నష్టపోయామని మొత్తుకుంటున్నారు.