16-10-2025 12:35:33 PM
తనిఖీలు చేసి పెనాల్టీ వేసిన తీరు మార్చుకొని షాపు నిర్వాహకులు...
కోదాడ: కోదాడ పట్టణంలో వీధికొక చికెన్ షాప్(Chicken shop) వెలిసింది.. ఏర్పాటైన షాపులలో పరిశుభ్రత పాటించకపోగా, చనిపోయిన కోళ్లను కోసి విక్రయిస్తున్నారు. అడపాదడప తనిఖీలు చేస్తున్న మున్సిపల్ అధికారులు(Municipal officials) పెనాల్టీ వేసిన షాపు నిర్వాహకులు మాత్రం వారి తీరు మార్చుకోవటం లేదు. చనిపోయిన కోళ్లను కోస్తూ ప్రజలకు వాటిని విక్రయిస్తున్నారు. దీంతో అనేకమంది రోగాల బారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పట్టణ ప్రజల ఆరోపిస్తున్నారు.
పట్టణంలోని ఇటీవల ఓ షాప్ పైన మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ తనిఖీలు చేసి పరిశుభ్రంగా లేకపోవడంతో ఆ షాప్ కు పెనాల్టీ వేశారు. కానీ సదరు నిర్వాహకుడు పెనాల్టీ వేసిన పట్టించుకోకుండా చనిపోయిన కోళ్లను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు... ఇలా ఆ ఒక్కసాపే కాకుండా పట్టణంలోని పలు షాపులలో చనిపోయిన కోళ్లను కోసి విక్రయిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు... మున్సిపల్ అధికారులు విస్తృత తనిఖీలు చేసి షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.