calender_icon.png 16 October, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు ఎందుకు వచ్చారో నాకు తెలియదు: కొండా మురళి

16-10-2025 09:35:35 AM

హైదరాబాద్: మంత్రి కొండా(Minister Konda Surekha) సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు(Task Force Police) వెళ్లిన ఘటనపై కొండా మురళి(Konda Murali) స్పందించారు. మీడియాతో కొండా మురళి మాట్లాడుతూ.... హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు తనకు తెలియదని, ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారో తెలుసుకుంటానని చెప్పారు. మీడియా ముందు మాట్లాడొద్దని రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.. మీనాక్షి నటరాజన్ ను కలిసి అన్ని విషయాలు మాట్లాడతా అన్నారు. సీఎం, పీసీసీ చీఫ్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని పేర్కొన్నారు. సాయంత్రం కొండా సురేఖ పార్టీ సమావేశానికి వెళ్తారని పేర్కొన్నారు. సీఎంతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పిన కొండా మురళి రేవంత్ రెడ్డి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి అంటే తమకు ఎంతో గౌరవం అన్నారు. నేను ఎరరి టార్గెట్ కాదు.., నాకు ఎవరూ టార్గెట్ లేరని తేల్చిచెప్పారు.

సుమంత్ విషయం నాకు ఏమీ తెలియదన్నారు. నా బిడ్డ, అల్లుడు లండన్ లో ఉన్నారు.. అక్కడే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. నా బిడ్డకు పదవి ఏమీ లేదు.. ఏ పార్టీలోనూ లేదన్నారు. నాకు స్మార్ట్ ఫోన్ చూడటం రాదు.. ఏమైందో తెలియదని సూచించారు. నేను, సురేఖ ఎప్పుడూ ఒకే కారులో వెళ్లం.. తిరగమన్నారు. భద్రతా కారణాల వల్ల వేర్వేరు కార్లలో నేను, సురేఖ వెళ్తామని వివరించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి మా ఇంటికి వచ్చారు.. నన్నెందుకు టార్గెట్ చేస్తారు.  నేను ఎప్పుడూ సచివాలయానికి వెళ్లలేదని ఆయన వివరించారు. సురేఖ గెలిచాక ఆమె ఛాంబర్ కు వెళ్లి వాస్తు చూసి వచ్చానని తెలిపారు. పనుంటే నేరుగా మంత్రి ఇంటికే వెళ్తా.. సచివాలయానికి వెళ్లనని మురళి చెప్పారు. నా బిడ్డ ఏం మాట్లాడిందో నాకు తెలియదని వెల్లడించారు. హైదరాబాద్ లో రాత్రి జరిగిన విషయాలు నాకేమీ తెలియవన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలి అనుకున్న వాళ్లోలో నేను ఒకడిని అని కొండా మురళి పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద రాత్రి హైడ్రామా నడించింది. వరంగల్ పోలీసులు రాత్రి కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో వెళ్లారు. కొండా సురేఖ మాజీ ఓఎస్ డీ సుమంత్ కోసం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులతో కొండా సురేఖ కుతూరు సుస్మిత గొడవకు దిగింది. ఇంటికి ఎందుకొచ్చారంటూ పోలీసులతో కొండా సుస్మిత వాగ్వాదం పెట్టుకుంది. సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని కొండా సుస్మిత డిమాండ్ చేశారు. అరెస్ట్ వారెంట్ చూపించాలని సుస్మిత కోరడంతో పోలీసులు వెనుదిరిగారు. సురేఖ ప్రైవేట్ ఓఎస్ డీ సుమంత్ కోసం రెండ్రోలుగా పోలీసులు గాలిస్తున్నారు. పలు ఆరోపణలతో సుమంత్ ను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది.

సుమంత్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసిందని కొండా సుస్మిత అన్నారు. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్ తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో అరెస్ట్ చేసుందుకు వచ్చామని పోలీసులు తెలిపారని ఆమె వెల్లడించారు. ఆధారాలు ఉంటే చూపించాలని పోలీసులను అడిగానని సుస్మిత అన్నారు. వరంగల్ లో నమోదైన  మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు చెప్పారని తెలిపారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారని కొండా సుస్మిత కీలక వ్యాఖ్యల చేశారు. మా నాన్నను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని పేర్కొన్నారు.