16-10-2025 12:54:53 PM
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(Special Leave Petition) విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున విచారణను స్వీకరించలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. కావాలంటే పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని కోర్టు పేర్కొంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.