calender_icon.png 16 October, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం

16-10-2025 11:13:37 AM

నంగునూరు: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం కురిసిన భారీ వర్షం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గట్లమల్యాల,ఖాత, కొండంరాజుపల్లి, ఘనపూర్, అక్కనపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఆరు కాలాలు కష్టపడి పండించిన వరి పంట,కొనుగోలుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అకాల వర్షం కారణంగా తడిసి ముద్దైంది.అమ్మకానికి ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నూరు అవుతున్నారు.మొన్నటి వరకు యూరియా కోసం కష్టపడ్డాం, నేడు పంట చేతికి వచ్చాక అకాల వర్షం వల్ల ధాన్యం పూర్తిగా తడిసి నీరు పాలవుతుంద"ని రోదిస్తున్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని,నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.