calender_icon.png 16 October, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న బీసీ బంద్ ను జయప్రదం చేయండి

16-10-2025 12:31:55 PM

హన్మకొండ,(విజయక్రాంతి): స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించటానికి అక్టోబర్ 18 న బీసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ని విజయవంతం చేయాలని వరంగల్ బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు మాట్లాడుతూ బలహీనవర్గాలకి చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోగా, స్థానిక సంస్థలలో ఉన్న రిజర్వేషన్లు తగ్గిపోవడం, ఉన్న రిజర్వేషన్లను కాపాడుకోలేకపోవటం వలన బీసీలకి రాజకీయ అవకాశాలు దక్కటంలో అన్యాయం జరిగిందని అభిప్రాయపడినారు. స్థానిక సంస్థలలో గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే, 2019లో 23 శాతానికి తగ్గినాయి, కానీ రిజర్వేషన్ల విషయంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచినప్పటికీ చట్టాలను అడ్డంపెట్టి రిజర్వేషన్లకి అడ్డుపడటం అంటే సామాజిక న్యాయానికి సహజ న్యాయానికి అడ్డుపడటమే అని అభిప్రాయపడ్డారు.

బీసీ నాయకులు సోమిడి అంజనరావు, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టకుండా, పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్టపరంగా రిజర్వేషన్లు సాధించే ప్రయత్నాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల సాధనకి సహకరించాలని డిమాండ్ చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో బీసీల కి 42 శాతం రిజర్వేషన్లను కల్పించి తొమ్మిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేశారు.అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధన కోసం అక్టోబర్ 18 న రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్ కి రాజకీయ పార్టీలు, వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు సహకరించాలని విద్యార్థులు కార్మికులు, బీసీ సంఘాలు కుల సంఘాలు, ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.18 న బంద్ లో భాగంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకి అమరవీరుల స్థూపం నుండి, అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు సోమిడి అంజన్ రావు,దారబోయిన సతీష్, డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్, బీసీ కుల సంఘాల జిల్లా కన్వీనర్ రావుల సురేష్, దామెరకొండ కొమరయ్య,ఆలకుంట్ల ఎల్లయ్య,ఎదునూరి రాజమౌళి, చాపర్తి కుమార్ గాడ్గే, కేడల ప్రసాద్, వేణు చారి, డేనియల్, వినయ్ చారి, కృష్ణ కుమార్,సుధాకర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.