calender_icon.png 30 October, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

11-11-2024 11:37:28 AM

జగదేవపూర్ (విజయక్రాంతి): అప్పుల బాధతో రైతు ఆత్మహత్య మండల కేంద్రమైన జగదేవపూర్ లో చోటుచేసుకుంది. జగదేవపూర్ కు చెందిన దాచారం భిక్షపతి(52) వ్యవసాయంతో పాటు కుటుంబ అవసరాలకు పలువురి వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. పంట గిట్టుబాటు కాక అప్పులు తీర్చే మార్గం తెలియక తీవ్ర మనోవేదన చెందాడు. అప్పులు తీర్చలేదన్న మనోవేదనతో తన వ్యవసాయ భావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భిక్షపతి తన వ్యవసాయ భావి వద్ద పడిపోవడం చూసిన స్టానికులు గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుండి మెరుగయిన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భిక్షపతి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య లలిత కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు.