calender_icon.png 15 December, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్‌తో కుట్ర

15-12-2025 01:30:02 AM

రాజ్యాంగాన్ని రద్దు చేసే యోచనలో కేంద్రం

  1. ఆర్‌ఎస్‌ఎస్, గోల్వాల్కర్ భావజాలాన్ని అమలుకు పన్నాగం
  2. రాహుల్‌గాంధీ పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధం
  3. ఢిల్లీలో ఓటు చోరీ గద్దీ ఛోడ్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : ఎస్‌ఐఆర్( ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) పేరుతో తొలుత ఓటరు కార్డు తొలగిస్తారు.. ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డులు రద్దు చేస్తారు,  ఆపై వాళ్లకున్న హక్కులన్నీ గుంజుకుంటా రు.. చివరకు రాజ్యాంగాన్ని కూడా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజ మెత్తారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి న బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఓటు చోరీ గద్దీ ఛోడ్’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ రాజ్యాంగ రచన సమయంలో .. చట్ట సభలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు విషయంపై చర్చిస్తున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్ తదితరు లు.. వారికి ఓటు హక్కు ఇవ్వొద్దని చెప్పారని  సీఎం గుర్తుచేశారు.

కానీ, గాంధీ, అంబేద్కర్ వారికి ఓటు హక్కు కల్పించినందునే ఈ దేశంలో ప్రభుత్వ ఏర్పాటు లో భాగస్వాములవుతున్నారని సీఎం తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పా టు చేసిన తర్వాత వారి భావజాలాన్ని అమలు చేసేందుకే పార్లమెంట్‌లో 400 సీట్లు కావాలని కోరుకున్నారని విమర్శించారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రాహుల్‌గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు ఆ పార్టీకి గత ఎన్నికల్లో 240 సీట్లకు పరిమితం చేశారని పేర్కొన్నారు.

అందువల్లే ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. అందుకే ఎస్‌ఐర్ పేరుతో బీజేపీ మళ్లీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. నాడు పేద లు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల కోసం గాంధీ, అంబేద్కర్ నిలబడినట్లే .. ఇప్పుడు రాహుల్‌గాంధీ , మల్లికార్జున ఖర్గే నిలు స్తున్నారని, వారికి మనందరం అండగా నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సర్‌కు వ్యతిరే కంగా రాహుల్‌గాంధీ చేసే పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, దేశ ప్రజలంతా కలిసి రావాలని సీఎం కోరారు.