calender_icon.png 16 December, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బారులుతీరిన ఓటర్లు

15-12-2025 01:30:34 AM

  1. రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

మధ్యాహ్నం 1.00 గంటల వరకు 82.65 శాతం పోలింగ్ 

చుంచుపల్లి అత్యల్పంగా 66.19 శాతం.

అశ్వరావుపేట అత్యధికంగా 87. 85 శాతం నమోదు. 

భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 14,(విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం 1.00 గంట వరకు జిల్లావ్యాప్తంగా 82.65 శాతం ఓటు నమో దు అయింది.

మొత్తం ఓటర్లు 1,96,395 మంది ఉండగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 1,62,323 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఉద యం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ఉద యం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం1.00 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం 82.65 శా తంగా . నమోదయింది. 

మండలాల వారీగా పోలింగ్ శాతం 

అన్నపురెడ్డిపల్లి మండలంలో 85.13%, అశ్వరావుపేటలో 87.85%, చంద్రుగొండ లో 85.93%, చుంచుపల్లిలో 66.19%, దమ్మపేటలో 85.73%, ములకలపల్లిలో 86.59%, పాల్వంచలో 86.58%గా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల లోపల ఉన్న ప్రతి ఒక్క ఓటరికి త ప్పనిసరిగా ఓటు వేసే అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి తేష్ వి పాటిల్ స్పష్టం చేశారు.

పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల పరిధిలో ఉ న్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అదేవిధంగా, పోలింగ్ పూర్తున వెంటనే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా పాటి స్తూ నిర్వహించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ఎన్నికల నియమావళి ప్రకారం పారదర్శకంగా వ్యవహరించా లని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.