calender_icon.png 23 September, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క-సారలమ్మ తల్లికి బంగారం సమర్పించిన సీఎం

23-09-2025 01:33:42 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం నాడు ములుగు జిల్లాలోని మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క-సారమ్మ(Medaram Sammakka Saralamma) గద్దెలను సీఎం, మంత్రులు దర్శించుకున్నారు. మేడారం గద్దెల వద్ద రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క-సారలమ్మ తల్లికి ముఖ్యమంత్రి బంగారం సమర్పించారు. నిలువెత్తు 68 కిలోల బెల్లాన్ని మొక్కుగా సమర్పించారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ మేడారం వెళ్లారు. కాసేపట్లో మేడారం అభివృద్ధి పనులపై సీఎం, మంత్రులు సమీక్షించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులపై పూజారులు, గిరిజన పెద్దలతో చర్చించనున్నారు. గద్దెల విస్తరణ, మార్పుల డిజైన్ కు సీఎం తుది సూచనలు చేయనున్నారు. చర్చల అనంతరం అభివృద్ధి పనుల డిజిటల్ ప్లాన్ ను రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.