23-09-2025 01:50:28 PM
దళిత బంధు, బీసీ బందు పథకాలు ఎవరికిచ్చారో ప్రజలకు తెలవదా..
ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టిన నాయకులకు బుద్ధి రాలే..
మంత్రి శ్రీధర్ బాబు, సోదరుడు శ్రీనుబాబు మంథని నియోజకవర్గం అభివృద్ధే ద్వేయంగా పనిచేస్తున్నారు..
ముత్తారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతారంలో మతిభ్రమించి మాట్లాడటం సిగ్గుచేటు..
ముత్తారం మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు..
ముత్తారం (విజయక్రాంతి): గత పదేండ్ల మీ ప్రభుత్వంలో పోతారం గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇచ్చారా... దళిత బంధు, బీసీ బందు పథకాలు ఎవరికిచ్చారో ప్రజలకు తెలవదా... ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికల్లో బొంద పెట్టిన నాయకులకు మాత్రం ఇంకా బుద్ధి రాలేదని ముత్తారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతారంలో మతిభ్రమించి మాట్లాడటం సిగ్గుచేటని ముత్తారం మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు మంగళవారం ఒక ప్రకటనలో బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పది ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు ఇవ్వకుండా, మీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని, అందుకు ఉదాహరణ మీరు సోమవారం పోతారం గ్రామంలో పర్యటించారని, మరి ఆ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారో చూపించాలని, అలాగే దళిత బంధు, బీసీ బంధు పథకాలు ఎంతమంది పేద ప్రజలకు ఇచ్చారో నిరూపించాలని జగన్మోహనరావు ప్రశ్నించారు.
మీ ప్రభుత్వం లోనే మీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందించారని, అది గమనించిన ప్రజలు మిమ్ముల చిత్తుచిత్తుగా ఓడించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాల్లోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గానికి 3500 ఇండ్లు తీసుకువచ్చారని, మీ ప్రభుత్వంలో మండలంలో కానీ పోతారం లో కానీ ఒక్క ఇల్లు అయినా తీసుకువచ్చారా... అని ప్రశ్నించారు. అధిక నిధులు తీసుకొచ్చి, అభివృద్ధి చేస్తుంటే కళ్ళు ఉండి చూడలేని గుడ్డివాడిలా బీఆర్ఎస్ నాయకులు వ్యవహారిస్తున్నారన్నారు.
గ్రామాల్లో అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు
గ్రామాల్లో అర్హులైన వారికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, మొదటి విడతగా గ్రామంలోని పేదవారికి ఇండ్లు నిర్మించి, రెండో విడుతలో అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామంలోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు బీఆర్ఎస్ నాయకులు మీ గుండెలపై చేయి వేసుకొని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని నాగినేని సూచించారు. మంత్రిగా శ్రీధర్ బాబు, వారి సోదరుడు శ్రీనుబాబు ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నారని అన్నారు. ఆయనతో పాటు పీఎసీఎస్ డైరెక్టర్ బుచ్చంరావు, నాయకులు చొప్పరి సంపత్, డా. చారి పాల్గొన్నారు.