calender_icon.png 23 September, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైను చూడక్క.. బిడ్డకు పాలిచ్చి వస్తా

23-09-2025 02:00:34 PM

ఆకలి వేస్తుంది... అన్నం తినోస్తా... 

యూరియా కోసం మహిళల బాధలు 

నకిరేకల్ (విజయక్రాంతి): పాల కోసం పసిబిడ్డ బుక్కపట్టి ఏడుస్తుంది. జర ఆగు బిడ్డ. లైను పోతది. యూరియా దొరకదు.. బిడ్డను ఓదార్చు.. ఆబిడ్డ ఏడుపు ఆపకపోవడంతో జర చూడు అక్క లైన్ను బిడ్డకు పాలిచ్చి వస్తా అంటు ఓతల్లి పడుతున్న వేదన అందరూ హృదయాన్ని పిండేసింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలో యూరియా కోసం మంగళవారం తెల్లవారుజాము నుండే రైతులు చంటి బిడ్డలతో సైతం మహిళలు క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. మరి కొంతమంది మహిళలు చలి అన్నం సద్దులు పెట్టుకొని మరి వచ్చారు.. ఆకలి వేయడంతో ఆ మహిళలు వెంట తెచ్చుకున్న సద్ది అన్నాన్ని తిని ఆకలి తీర్చుకొని వేదావిధిగా యూరియా కోసం లైనులో వేచి చూశారు. ఈ ఘటన విజయక్రాంతి కెమెరాకు చిక్కింది.. యూరియా కోసం రైతులు మహిళలు ఇంత ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి అధికారులకు పట్టదా అని పలువురు విమర్శిస్తున్నారు.