calender_icon.png 23 September, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి

23-09-2025 01:28:29 PM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..

చిట్యాల (విజయక్రాంతి): నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 80 మంది లబ్దిదారులకు రూ.25,70,000. సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు.

మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్, టీపిసీసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, చిట్యాల, టేకుమట్ల మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, కోటగిరి సతీష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్, టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, చిలుకల రాయకొమురు, బుర్ర శ్రీనివాస్, మూల శంకర్ గౌడ్, ఎండీ రాజ్ మహమ్మద్, గంగాధరి రవీందర్, సర్వ శరత్ తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ

టేకుమట్ల మండలంలోని అంకుశాపూర్ గ్రామానికి చెందిన డిష్ ఆపరేటర్ సాధ ఓదెలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిట్యాల ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే దైర్యం చెప్పారు.