calender_icon.png 23 September, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయసముద్రం చెరువు వద్ద నాగులమ్మ తల్లి దేవాలయ పనుల ప్రారంభం

23-09-2025 02:46:25 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఓల్డ్ రాయసముద్రం చెరువు వద్ద ఇటీవల నిర్మించిన శ్రీశ్రీశ్రీ నాగులమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో మట్టి కుంగిపోతుందని స్థానికులు తెలియజేయడంతో, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ సుమారు రూ.16 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి, ఈరోజు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ దివ్య, స్థానిక నాయకులు చిగురు శ్రీను, కిరణ్ గౌడ్, అప్పల భాస్కర్, నవీన్ గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ కావలి నగేష్, మాజీ ఎఎంసి డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్, గారెళ్ల శ్రీశైలం, సిఎం మల్లేష్, రవి గౌడ్, సంతోష్, బైకన్ నవీన్ యాదవ్, కుమ్మరి రాజు, బికె శ్రీనివాస్, ఎర్ర హన్మంతు, నాగరాజు గౌడ్, కిట్టు, కుమ్మరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.