23-09-2025 02:38:27 PM
హైదరాబాద్: జీఎస్టీతో పేరుతో 8 ఏళ్లుగా ప్రజలను బీజేపీ సర్కార్ దోచుకుందని, జీఎస్టీతో పేదలకు లబ్ది చేసినట్లు బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ధ్వజమెత్తారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని తాము మొదటి నుంచే చెప్తున్నామని.. పేదలను దోచుకోవడానికి జీఎస్టీ తెచ్చారని అన్నారు. శవపేటికలపై, పిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేశారని.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతో ఏదైనా మంచిపని చేసిందా..? అని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని.. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల నష్టం జరుగుతుందని అన్నారు. ఈ రూ.7 వేల కోట్ల నష్టం పూడ్చే బాధ్యత కేంద్రానిదేనని.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. ఈ నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పాలన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి అండగా ఉండాలన్నారు.