23-09-2025 02:03:07 PM
ప్లాస్టిక్ బస్తాలలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు..
క్వింటన్నర గంజాయి లభ్యం... విచారణ చేస్తున్న పోలీసులు...
కోదాడ: కోదాడలో గంజాయి కలకలం రేపింది... సుమారు క్వింటన్నర గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు... పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కోదాడ పురపాలక సంఘం పరిధి జాతీయ రహదారి 65 హైదరాబాద్-విజయవాడ బైపాస్ లో గల మామిడికాయల యార్డ్ పాత షెడ్డులో ప్లాస్టిక్ బస్తాలలో గంజాయి ఉండడం, అటుగా వెళుతున్న రైతులు గంజాయిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు ఐదు గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దాదాపు 110 కేజీలకు పైగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో రహస్య ప్రదేశంలో గంజాయి దాచి ఉండవచ్చని పోలీసుల అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలను పర్యవేక్షించి నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు.