కోరెంలో వర్షాలు కురవాలని కప్పతల్లి ఆడిన రైతులు
22-06-2026 12:00 AM
బోయినపల్లి: జూన్ 21 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండ లం కోరెం గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామస్తులు రైతులు స్థానిక నాయకులు ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి, హనుమాన్ , శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కప్పతల్లితో ప్రత్యేక పూజలు చేసి కప్పతల్లి ఆట ఆడారు.
గ్రామంలోని ప్రధాన వీధుల నుం చి కప్ప తల్లితో రైతులు డప్పుల చాటింపుతో ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో స ర్పంచ్ జంపుక మాధవి ఆనంద్, టిఆర్‌ఎస్ నాయకులు డబ్బు వెంకట్ రెడ్డి, గడ్డం తిరుపతి రెడ్డి, కొమ్ముల ఆనంద్ రెడ్డి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.






