బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి అందజేత
జనగామ, జూన్ 21 (విజయక్రాంతి): జనగామ జిల్లా చౌడారం గ్రామానికి చెందిన యాసరపు ప్రవీణ్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ నాయకులు దూడల సిద్ధన్న, యాసరపు పరుశురాములు ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా బాధితుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి సహాయం అందించిన నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నూకల బాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ దూడల సిద్ధయ్య గౌడ్, మచ్చ ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మునిగే వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.






