calender_icon.png 1 January, 2026 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారనున్న పెద్దఅంబర్‌పేట్ రూపురేఖలు

01-01-2026 12:00:00 AM

ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో మున్సిపాలిటీలన్నీ 

జీహెచ్‌ఎంసీలో విలీనం

అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 31: పెద్ద అంబర్‌పేట్ పరిసరా ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రెవెన్యూ గ్రామ పంచాయతీల మొదటగా మున్సిపాలిటీలో విలీనం చేసి.. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో నాగోల్ సర్కిల్ కార్యాలయాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. నాగోల్, మన్సూరాబాద్, జీఎస్‌ఐ, లెక్చరర్ కాలనీ, కుంట్లూరు, పెద్ద అంబర్‌పేట్ ఆరు డివిజన్లతో నాగోల్ సర్కిల్‌గా ఏర్పాటు చేశారు. 

దీంతో నగర శివారు ప్రాంతమైన (పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ) పరిధిలోని తట్టిఅన్నారం, కుంట్లూరు, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, తారామాతిపేట్, పసుమాముల, పెద్ద అంబర్‌పేట్ గ్రామాలన్ని మరింత అభివృద్ది చెంది రూపురేఖలు మారనున్నాయి. డిప్యూటీ కమిషనర్‌గా ఎస్. రవీందర్‌రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలోనే నాగోల్ సర్కిల్ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో కార్యాలయంపై పేర్లు మార్పు చేసిన అధికారులు పాలనను కొనసాగితున్నారు.

శరవేగంగా శివారు ప్రాంతాలు అభివృద్ది

పెద్ద అంబర్‌పేట్ సర్కిల్‌లో ఇక నుంచి శరవేగంగా అభివృద్ది కానుంది. విజయవాడ హైవే కావడంతో ఇప్పటికే ఈ ఏరియాలో పలు కాలనీలు వెలిశాయి. దీనికి తోడు రామోజీ ఫిలిం సిటీ, పలు ఇంజనీరింగ్ విద్యాసంస్థలు,  అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడలో వ్యవసా య మార్కెట్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిసరా ప్రాంతా ల్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో విల్లాలు వెలిశాయి. అదే విధంగా నాగోల్ సర్కిల్ ఆఫీసును పెద్ద అంబర్‌పేట్‌లో పాలన కొనసాగిస్తుండడంతో ప్రజాప్రతినిధుల, అధికారులు ప్రత్యేక దృష్టితో  అతి తర్వలో  ఈ ప్రాంతం అభివృద్ది దూసుకుపోనున్నది. 

డీసీగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి

ఎల్బీనగర్ డివిజన్ పరిధిలోని నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా ఎస్. రవీందర్‌రెడ్డిని నియమిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ విలీనానికి ముందు పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమీషనర్‌గా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డిని తాజాగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నియమించడంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు.