21-08-2025 01:51:14 AM
దిగ్విజయంగా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): తుకారాం గేట్, మౌలాలి, సికింద్రాబాద్‌కు చెందిన 58 సంవత్సరాల వ్యక్తి గత 6 నెలలుగా శోషరస గ్రంథి వాపు (నొప్పిలేకుండా), జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, అలసట, ఛాతీలో నొ ప్పి, చర్మం పై దద్దుర్లు వంటి తదితర సమస్యలతో బాధపడుతున్నారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్, విద్యానగర్ వైద్యులను సంప్రదించగా అరుదైన “హై గ్రేడ్ నాన్ హాడ్కిన్ లింఫోమా” అనే క్యా న్సర్ అని నిర్ధారించారు. వెంటనే చికిత్స ప్రా రంభించాలని లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. ప్రముఖ సర్జికల్ ఆంకాలజీ చికిత్స నిపుణులైన డాక్టర్ యు.ఆజాద్ చం ద్రశేఖర్, మెడికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, వారి సహచర వైద్య బృందం డాక్టర్ విశాల్ టోకా, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్, హెమటో ఆంకా లజిస్ట్ ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని చికిత్సను ప్రారంభించారు.
డాక్టర్ విశాల్ టోకా తన బృందం హై గ్రేడ్ నాన్ హాడ్కిన్ లిం ఫోమా చికిత్సపై ప్రణాళికాబద్దంగా ముం దుకు కదిలి ముందుగా మూడు (3) సైకిళ్ల హైడోస్ కెమోథెరపీ ఇవ్వడం పేషెంట్ చికిత్సకు బాగా స్పందిస్తుండటంతో ఆటోలోగస్ విధానం ద్వారా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ ని విజయవంతంగా పూర్తి చేశారు.
వారు అందించిన చికిత్సానంతరం సేవలతో పేషెంట్ పూర్తి ఆరోగ్యంతో నెల రోజుల్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పేషెంట్ యొక్క వయసు, కు టుంబ సభ్యుల ఆర్థిక స్థితిని పరిగణలోనికి తీసుకోని సాధ్యమైనంతవరకు తక్కువ ఖర్చు తో ఎక్కడ రాజీ లేకుండా చికిత్స అందించామని డాక్టర్ యు.ఆజాద్ చంద్రశేఖర్, డాక్టర్ విశాల్ టోకా చెప్పారు.