calender_icon.png 1 January, 2026 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నిరసన

31-12-2025 01:45:08 AM

సోయా, మొక్కజొన్న కొనుగోలు కోసం కొనసాగుతున్న ఆందోళన

ఆదిలాబాద్/బోథ్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పంటలు అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సోయా, మొ క్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ, బీఆర్‌ఎస్ నా యకులు మద్దతు పలికారు. పూర్తి స్థాయిలో సోయా కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా పత్తి విక్రయించేందుకు వచ్చిన వాహ నాలను భారీగా నిలిచిపోయాయి. పోలీసులు అక్కడి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మార్కెటింగ్ ఏడీ గజానంద్ సైతం వారితో మాట్లాడి ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహసినిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు శ్రమించి పండించిన సో యా ప్రకృతి వైపరీత్యం కారణంగా రంగు మారిందన్నారు.

సోయా కొనాలని ఆందోళనలు చేయడంతో అధికారులు రైతులకు షెడ్యూల్ ఇచ్చారన్నారు. షెడ్యూల్ ప్రకారం రైతులు సోయా తీసుకుని మార్కెట్‌కు వస్తే మూడు రోజులుగా వారిని పట్టింకోవడం లేదన్నారు. దీంతో ప్రైవేటుకు విక్రయించి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారని తెలిపారు. ఆంక్షలు లేకుండా రైతుల వద్ద ఉన్న సోయా చివరి గింజ వరకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనాలని డిమాండ్ చేశారు.

నిరసనలో మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు సం ఘం నాయకులు బండి దత్తాత్రి, రైతులు పాల్గొన్నారు. బోథ్ మండల కేంద్రంలో సైతం రైతులు ఆందోళనకు దిగారు. కోరమండల్ వద్ద రహదారిపై రోడ్డుపై బైఠా యించారు. రెండు గంటల పాటు కొనసాగిన ఆందోళనతో దాదాపు రెండు కిలోమీ టర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. మార్కెట్ అధికారులు, పోలీసులు ఎంత స ముదాయించిన రైతులు పంట కొనుగోలు చేసేంతవరకు కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.