calender_icon.png 1 January, 2026 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గీతా వాహిని

31-12-2025 01:44:42 AM

వికారాబాద్, డిసెంబర్ -30: గీతావాహిని ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏకాదశికి గీతా పారాయణం జరుగుతుందని గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు.  మంగళవారం  ముక్కోటి ఏకాదశి సందర్భంగా గీత వాహిని ఆధ్వర్యంలో  పట్టణం లోని  శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద సామూహిక  గీతా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా గీత వాహిని సభ్యులు వివిధ ఆలయాలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని గణేష్ కట్ట వద్ద పారాయణంలో పాల్గొనడం జరిగింది.

ముక్కోటి ఏకాదశి అంటే ఈ ఒక్క ఏకాదశి జరుపుకున్న మూడు కోట్ల ఏకాదశి జరుపుకున్న పుణ్యం వస్తుందని, ఇవాళ పుత్ర పుత్రద ఏకాదశి కూడా అంటారని తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా గీత వాహిని ఆధ్వర్యంలో వివిధ పుణ్యక్షేత్రాలలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం చేయడం జరుగుతుందని దాంట్లో భాగంగా  జనవరి 19న   85 మంది గీతా వాహిని సభ్యులు  ద్వారకాలో సంపూర్ణ భగవద్గీత పారాయణానికి బయలుదేరడం జరుగుతుందని  గీతా వాహిని అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ కారక్రమంలో గీతా వాహిని కమిటీ సభ్యులు శ్రీదేవి, లావణ్య, విజయ, మాధురి, సునీత ,స్వాతి ,ఝాన్సీ రాణి, నీరజ, నాగరాణి, వరలక్ష్మి, మమత, లక్ష్మి సరల, సరిత, విజయ తదితరులు పాల్గొన్నారు.