calender_icon.png 30 September, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బునాదిగాని కాలువలో చెత్తను తొలగించిన రైతులు

30-09-2025 08:49:43 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని పహిల్వాన్ పురం గ్రామ పరిధిలో గల బునాదిగాని చెరువులోకి వచ్చే కాలువలో పేరుకుపోయిన చెత్తను రైతులు స్వచ్ఛందంగా తొలగించారు. బునాదిగాని చెరువు నిండినట్లయితే రెడ్ల రేపాక, కంచనపల్లి, పులిగిల్ల తదితర గ్రామాలకు కూడా సాగునీరు అందుతుందని రైతులు కాలువలు పేరుకపోయినా చెత్తను తొలగించారు. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా కాల్వకు అడ్డుపడుతున్న చెత్తను తొలగించడం పట్ల ఇతర గ్రామాల రైతులు వారికి కాల్వ కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తిరెడ్డి, మామిడి సత్తిరెడ్డి, గాడిపళ్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.