30-09-2025 08:47:39 PM
మేడిపల్లి (విజయక్రాంతి): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బోడుప్పల్ శ్రీ మాత నిమిషాంబ దేవి ఆలయంలో భక్తులకు అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు. శ్రీ దుర్గా దేవి అమ్మవారు విశేష అలంకరణలలో పంచ ప్రకృతి మహా స్వరూపాలలో 9వ రోజు ఆదిపరాశక్తిగా, అమ్మను పూజిస్తే శక్తి, ధైర్యాన్ని ఇచ్చి కష్టాలు తొలగిస్తుందని, శత్రు బాధలు తొలుగుతాయని, సర్వత్వ విజయం ప్రాప్తిస్తుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ పల్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.