7 May, 2026 | 1:06 AM

పంటల మార్పిడి విధానాన్ని రైతులు అవలంబించాలి

07-05-2026 12:19 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం..

బాన్సువాడ, మే 6 (విజయక్రాంతి): పంటల మార్పిడి విధానాన్ని రైతులు అవలంబించాలని రైతులకు అధికారులు అవగా హన కల్పించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నా రు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో బుధవారం రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  రైతుల ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి విధానాలపై వ్యవసాయ అధికారులు సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి అప్పులేని వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని కోరారు. సేంద్రీయ ఎరువుల వినియోగంతో సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా నేల ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు దీర్ఘకాలికంగా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని ఆయన అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, ఖర్చు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలను అన్వేషించాలని రైతులకు సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు సాంకేతిక సలహాలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.