7 May, 2026 | 1:07 AM

కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

07-05-2026 12:17 AM

మహబూబాబాద్, మే 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు వరంగల్ నగరంలోని హంటర్ రోడ్డులో నిర్వహించిన సభలో ఎంపీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌ను బుధవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, హనుమ కొండ, వరంగల్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, అయూబ్  కేటీ ఆర్‌పై ఫిర్యాదు చేశారు.  ఆయనపై కఠిన చర్య లు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు.