calender_icon.png 1 May, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుకు వ్యాపారితో సమానంగా హక్కులు కల్పించాలి

01-05-2025 01:14:14 AM

తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌ఆర్ అల్వార్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం లో సికింద్రాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌ఆర్ అల్వార్‌రెడ్డి మా ట్లాడుతూ.. రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. ‘బ్యాంకర్లు రైతుల భూమిని తాకట్టు పెట్టుకొ ని అప్పులు ఇస్తున్నారు.

అదే వ్యాపారస్తులకు మాత్రం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇస్తున్నారు. బ్యాంకులు రైతులకు కేవలం పంటలకు పెట్టుబడికి అవసరమైన మొత్తంలోనే రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణా న్ని రైతులు తమ నిత్యవసరాలకు వాడుకొని, పెట్టుబడి సాయానికి తిరిగి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులనే ఆశ్రయిస్తున్నారు.

పంటలో నష్టం వాటిల్లినప్పుడు తెచ్చిన అప్పు లకు వడ్డీలు కట్టలేక, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల పేరటి అక్రమ ప ట్టా చేస్తే బాధిత రైతుకు న్యాయం చేసేది ఎ వరు. కోర్టుకెళితే అక్రమ పట్టాదారులపైన, రె వెన్యూ అధికారులపైనా ఎలాంటి శిక్షలుండవు.

వ్యాపారిని మోసం చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాయి. రైతులకో న్యాయం, వ్యాపారులకో న్యాయం సరికాదు. బ్యాం కులు సైతం రూ.కోటి విలువ ఉన్న ఎకరం భూమిని కుదువబెట్టుకొని రూ.లక్ష మాత్రమే అప్పుగా ఇస్తున్నాయి. బంగారం కుదువపెట్టుకుంటే 60 శాతం రుణం ఇస్తారు. కానీ రైతుకు 1 శాతం మాత్రమే ఇస్తారు. ఈ విధానం మారాలి. అని అల్వార్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రధాన డిమాండ్లు

1. రైతులను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.

2. ఎకరాకు పంట రుణం రూ.లక్ష ఇవ్వాలి.

౩. ఎకరా భూమి కుదువ పెట్టుకొని 40 లక్షల ఋణం ఇవ్వాలి. 

4. అసైన్‌మెంట్ చట్టం, ఆర్‌వోఆర్ చట్టం, సీలింగ్ యాక్ట్, ఆర్‌టీఏ యాక్ట్ చట్టాలను ధిక్కరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి.

5. రైతుకు చట్టబద్ధంగా ఇన్సూరెన్స్ కల్పించాలి. 

6. ఒట్టిపోయిన పాడి ఆవులను ప్రభుత్వమే కొనాలి