01-05-2025 01:14:53 AM
డైరెక్టర్ డాక్టర్ రాకేష్
ఖమ్మం, ఏప్రిల్ 30 ( విజయ క్రాంతి): ఖమ్మంలోని అంకూర హాస్పిటల్లో ప్రపంచ స్థాయి విద్య సేవలు అందించే విధంగా 9 ఎం ఫెర్టిలిటీ, చైల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించినట్టు అంకుర సంస్థల డైరెక్టర్ డాక్టర్ రాకేష్ చలగల్ల తెలిపారు. మహిళలు, పిల్లల సంరక్షణ లో ప్రఖ్యాతి పొందిన అంకుర హాస్పటల్ లో అధునాతన సౌకర్యాలతో సెంటర్ ప్రారంభించడం గర్వంగా ఉందని అన్నారు. వైద్య రంగంలో నైతిక విలువలు పాటిస్తూ, పార దర్శక సేవలు అందజేయడమే లక్ష్యంగా యాజమాన్యం ముందుకెళ్తుందని చెప్పారు.
దేశంలో 15 శాతం జంటలు వందత్వం తో పోరాడుతున్నారని, 27.5 మిలియన్ల మంది గర్భం దాల్చడం లో సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణ లో సైతం ఈ సమస్య అత్యధికంగా ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగానే హైదారాబాద్, పూణే, భువనేశ్వర్ లోని అంకురా హాస్పిటల్స్ లో 9ఎం ఫెర్టిలిటీ సెంటర్లను ప్రారంభించి , మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఖమ్మం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అంకుర హాస్పటల్‌అని సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.