calender_icon.png 7 October, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి

07-10-2025 12:00:00 AM

 తాడ్వాయి, అక్టోబర్, 6( విజయ క్రాంతి ): అకాల వర్షాల తో నష్టపోయిన అన్ని రకాల పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ తాడ్వాయి మండల శాఖ అధ్యక్షులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా అన్ని రకాల పంటలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు ప్రభుత్వం సర్వే చేసి ప్రతి గుంటకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఖరీఫ్ పంటలు వస్తున్నందున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు అనంతరం వారు స్థానిక తహసిల్దార్ కు  వినతిపత్రం అందించారు.  ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంగ్ జిల్లా గౌరవ అధ్యక్షులు దేవి రెడ్డి విట్టల్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.